జూన్ 19, 2009

ఆశీర్వాద ప్రార్థన-15 వ రోజు

Posted in Uncategorized tagged వద్ద 1:29 ఉద. ద్వారా grabtheeternity

గ్లోబల్ ప్రేయర్ డే తరువాత జరుగుతున్న ఆశీర్వాద ప్రార్థనలు,ఇవి తొంబై దినాలు కొనసాగుతాయి.

ద్వితీయోపదేశ కాండం …యొహోవా నీ కిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యోహోవా నీ గర్భ ఫల విషయంలోనూ,నీ పశువుల విషయం లోనూ , నీ నేల పంట విషయం లోనూ, నీకు సమృద్ధి గా మేలు కలుగ చేయును. యెహోవా నీ దేశము మీద దాని కాలమందు వర్షమును కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వాదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరచును.నీవు అనేక జనమునకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు.నేడు నేను మీకాజ్ఞాపించు మాటలు అన్నింటిలో దేనివిషయం లోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకను ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొన వలెనని నేడు నేను నీ కాజ్ఞాపించు చున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉందువు గాని క్రిందవాడవు గాఉండవు.

మీ విశ్వాసాన్ని ప్రకటించండి: మలాకీ ..కొరింథియులకు వ్రాసిన పత్రిక …పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో

నిలుచుండి ప్రార్థించండి: మీ దేశ ఆర్థిక ముఖ్య కార్యాలయాల యొద్ద నిలుచుండి ప్రార్థించండి. స్టాకు ఎక్సేంజ్, రిజర్వ బ్యాంకు, బ్యాంకులు,ఆర్థిక సంస్థల మొదలైన వాటి దగ్గర చేయండి.

జూన్ 9, 2009

ప్రపంచ ప్రార్థన-విశ్వాస విజయం

Posted in Uncategorized tagged వద్ద 2:33 ఉద. ద్వారా grabtheeternity

ప్రపంచం లోని ప్రజలందరి కోసం ఒకే సారి మే 31 న అన్ని దేశాలు (రెండువందల ఇరవై) వారి వారి ప్రజల నాయకుల రక్షణ కొరకు ప్రార్థించారు.ఒక్క విశాఖపట్నం లోనే ఏడు చోట్ల సమావేశమై తోటి ప్రజలకొరకు ప్రార్థించారు.అత్యధికంగా వేలాది గా కూడిన ప్రదేశం బీచ్ వాలీబాల్ కోర్ట్ లోఒక పక్క వర్షం తుంపరలుగా పడుతుంది.ముందుగా ప్రభువు కార్యాన్ని ప్రార్థన ద్వారా జల్లు ఆగిపోయిన తర్వాత పది మంది పది ప్రార్థనా అంశములతో అందరూ ఏకీభవించి ప్రార్థించారు.ప్రభు ఐక్యత గల ఆత్మను అనుగ్రహించి అనేకులు ఆప్రదేశములో సమావేశమై ప్రార్థించుటకు అవకాశం కలిగినది.శిలువ వేయబడిన తరువాత యాబైవ దినం “పెంతుకొస్తు” అనగా యేసుక్రీస్తు సిలువ వేయబడి మూడవ దినమున (ఈస్టర్) మరణం ను జయించి చేచి నలుబది దినములు శిశ్యులకు కనబడుతూ,వారితో సంభాషిస్తూ నలబైవ దినమున తండ్రి దగ్గరకు ఆరోహణామవుతూ మీ మధ్య ఉండుటకు పరిశుద్ధాత్మను పంపుదును అని చేసిన వాగ్దానం నెరవేర్పు పదిదినముల లో వారు యెరూషలేమును విడిచి వెల్లక తండ్రి వలన పొందిన ఆజ్ఞను(అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం),యెరూషలేము లోని మేడ గది మీద శిష్యులు చేసిన ప్రార్థన చేస్తుండగా పదియవ దినమున అనగా శిలువ వేయబడిన తర్వాత యాబైవ దినమున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చిన అనుభవమే “పెంతుకొస్తు” ఆదినమునే(పెంతుకొస్తు ఆదివారం) ప్రపంచ మంతా మిగిలిన వారి రక్షణ కొరకు ప్రార్థించే దినం.

మే 23, 2009

నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావు ?

Posted in Uncategorized వద్ద 2:19 ఉద. ద్వారా grabtheeternity

నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావు ?

మానవుని జీవిత కాలం ఈ భూమి మీద అతికొద్దికాలం డబ్బయి సంవత్సరములు లేదా అధిక బలమున్నచో ఎనబది సంవత్సరములు అనేది స్పష్టం.ఆ తర్వాత ఎక్కడ ? తర్వాత శాశ్వత కాలం గడపాల్సింది కొనుక్కుతెచ్చుకొనే నరకం లోనా, దేవునికి ఇష్టమైన వాడిగా మోసం ,దగా,వ్యసనాలు వదిలేసి పరలోకం(స్వర్గం) పొందడమా ?

ఈ భూమి ని విడిచిన తర్వాత ఇక శాశ్వత జీవితం ఉన్నప్పుడు మనం ప్రాకులాడావలసినది దానికోసమే.

సమస్తమైన ద్వేషము,కోపము,క్రోధము,అల్లరి,దూశణ,సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి.ఒకని యెడల యొకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరి నొకరు క్షమించుడి.